గుంతకల్లు: ఏఎస్పీ కే భద్రత లేకపోతే...సామాన్యుల పరిస్థితి ఏంటి:గుత్తిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి
రాష్ట్రంలో కూటమి పాలనలో ఏఎఎస్పీ, సీఐ, ఎస్ఐ, ఇతర పోలీసులకు భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో బుధవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు అసెంబ్లీ అబ్జర్వర్ బోయ తిప్పేస్వామితో కలిసి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి చైర్ పర్సన్ వన్నూరుబీతో తొలి సంతకం చేయించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు.