విశాఖపట్నం: ప్రస్తుత దేశ పరిస్థితులకు అద్దం పట్టే చిత్రం వేడుక - చిత్రం ప్రీమియర్ షోలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
భారతదేశంలో ఉన్న వాస్తవ పరిస్థితులు అద్దం పట్టే విధంగా నిర్మించిన చిత్రం వేడుక చిత్రం అని దీనిని ప్రతి ఒక్కరు ఆదరించాలని చిత్ర యూనిట్ కోరింది. నగరంలోని థియేటర్లో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా సినిమాలు తిలకించారు. ముఖ్యంగా పేదరికం అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసిన ఈ చిత్రం వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రొడ్యూసర్ రైటర్ డైరెక్టర్ బి రమేష్ బాబు డైరెక్టర్ ఈశ్వర్ ఉంగరాల తదితరులు పాల్గొన్నారు.