డోన్: చిన్న మల్కాపురం వద్ద డివైడర్ను ఢీకొట్టిన బైక్, ఒకరు మృతి మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు
Dhone, Nandyal | Apr 4, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వేసిన కంకర వల్ల ఓ బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మృతిచెందగా జహంగీర్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. గాయపడిన వ్యక్తిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు