ఒంగోలు అర్బన్: కొత్తపట్నంలో విషాదం, విద్యుత్ షాక్ తో యువరైతు బద్రీనాథ్ మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Jul 9, 2026
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండల కేంద్రంలోని సహస్ర వైన్షాప్ సమీపంలోని పొలంలో తెగిపడి ఉన్న విద్యుత్ కండక్టర్కు తగిలి పులి బద్రీ నారాయణ(22) మృతి చెందాడు. పశువులకు నీరు పెట్టేందుకు మోటార్ ఆన్ చేయడానికి వెళ్లిన సమయంలో వైరు గమనించక ప్రమాదానికి గురయ్యాడు. సమాచారం అందుకున్న SI సుధాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు