గుంతకల్లు: గుత్తి ఆర్ఎస్ లో రైల్వే ఎస్సీ, ఎస్టీ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వారోత్సవాలు
గుత్తి ఆర్ఎస్ లో ఆదివారం రైల్వే ఎస్సీ, ఎస్టీ యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ పుష్పరాజ్ మాట్లాడారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు. అందరూ పాల్గొని అంబేద్కర్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.