కోడుమూరు: బురాన్ దొడ్డిలో అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
సీ.బెలగల్ మండలంలోని బురాన్ దొడ్డి గ్రామంలో ఓ రైతు అప్పుల బాధతో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల మేరకు గ్రామానికి చెందిన రైతు ఫిలిప్ పంటల సాగులో నష్టాలు చవిచూడడంతో అప్పులు పెరిగిపోయాయి. అప్పులు ఎలా తీర్చాలనే మనస్థాపంతో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు రైతును కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మృతునికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.