ఒంగోలు: ఒంగోలు. జివిఆర్ ఫ్లైఓవర్ పై తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు లారీ డి గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్ కి తరలింపు
ఒంగోలు.ఆదివారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో జీవీఆర్ ఫ్లైఓవర్ మీద తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్తున్న లారీ ఢీ కొట్టడం తో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి గాయపడిన వారికి చికిత్స కోసం 108 అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ కు తరలించారు ప్రమాదం జరిగిన సమయం లో బస్సులో షుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న సింగరాయకొండ పోలీస్ లు ఎస్సై బి మహేంద్ర, సిబ్బంది, హైవే మొబైల్ పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు.