ఆళ్లగడ్డ: భూమా వర్సెస్ గంగుల ఆళ్లగడ్డలోహైటెన్షన్ భారీగా పోలీసుల మోహరింపు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బుధవారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అహోబిలం వివాదంపై విసిరిన డిబేట్ సవాలుకు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర నాథ్ రెడ్డి సిద్ధమయ్యారు, వైసీపీ శ్రేణులు భారీగా ఆయన నివాసానికి చేరుకున్నారు, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అహోబిలం వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు, ఇరుపక్షాల మాటల యుద్ధంతో ఆళ్లగడ్డలో భారీగా పోలీసులు మోహరించారు