ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఏపిటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల భారీ ధర్నా
Ongole Urban, Prakasam | Apr 18, 2026
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద శనివారం ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. 12వ పిఆర్సి కమిషన్ ను వెంటనే నియమించాలని ..ఐ ఆర్ 30 శాతం ప్రకటించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏల ను వెంటనే విడుదల చేయాలని కోరారు. సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ విధానాన్ని కొనసాగించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయడమే కాకుండా ఉద్యోగ ప్రమోషన్లను కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు