టిడిపి నాయకులు స్థాయిని మరిచి మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి మీద విమర్శలు చేయడం తగదని రాజకీయాల్లో దిగజారుడుతనం మంచిది కాదని విడపన కల్, ఉరవకొండ మండల కేంద్రాల్లో వైస్సార్సీపీ నాయకులు ఆదివారం మీడియా సమావేశం లో పేర్కొన్నారు. జనార్దనపల్లి భూవివాదంలో పయ్యావుల సోదరులు గ్రామాల్లో చిచ్చులు,భూతగాదాలతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలన సాగిస్తున్నారని ప్రతి పనికి భారీ మూల్యం ప్రజా క్షేత్రంలో చెల్లించక తప్పదని వైస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు.