ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్ను చట్టం (APGST), 2017 కింద పన్ను చెల్లింపుదారులకు చెల్లింపులు చేసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్నమయ్య జిల్లా రాయచోటి లో ఈరోజు (శనివారం) ఒక అవగాహన సదస్సు జరిగింది. రద్దు చేయబడిన పన్ను చెల్లింపుదారుల ఖాతాలకు టీడీఎస్ జమ చేయడం వల్ల భారీగా రెవెన్యూ నష్టం జరుగుతోందని జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్, ఐఏఎస్, వాణిజ్య పన్నుల సంయుక్త కమిషనర్ శ్రీమతి జి. సుమతి , యస్. సుమయ అసిస్టెంట్ కమిషనర్, రాయచోటి మరియు చిరంజీవి, అసిస్టెంట్ కమిషనర్, మదనపల్లి అవగాహన కలిపించారు. టీడీఎస్ మినహాయించే ముందు, సంబంధిత కాంట్రాక్టర్ లేదా స