అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేటలో శనివారం 4:10 నిమిషాల సమయంలోఎమ్మెల్యే పరిటాల సునీత స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ప్రధాన వీధులను శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ పాపంపేటలో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ కార్మికులు నిరంతరం కృషి చేస్తున్నారని, అందుకు గ్రామస్తులు కూడా సహకారం అందించాలన్నారు.అదేవిధంగా పంచాయతీ పారిశుధ్య కార్మికులకు అవసరమైన డస్ట్ బిన్లు తోపుడు బండ్లు నేడు కార్మికులకు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రజలు పాల్గొన్నారు.