తాడిపత్రి: కాసేపల్లి శివారులోని పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు, 17 మంది అరెస్ట్, నగదు స్వాధీనం
పెద్దవడుగూరు మండల పరిధిలోని కాసేపల్లి శివారులో పేకాట స్థావరంపై ఆదివారం రాత్రి ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్కడ పేకాట ఆడుతున్న 17 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.42,600 నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రెండు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.