ఒంగోలు అర్బన్: మహిళలు బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిందితులకు శిక్ష పడే విధంగా చూడాలి : ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | May 29, 2026
మహిళలు మరియు బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారిపై జరుగుతున్న నేరాల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా పోలీస్ శాఖ చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, మహిళా & శిశు భద్రత విభాగం ఐజీ రాజకుమారి,పర్యవేక్షణలో “స్పీడ్ ట్రయల్ మానిటరింగ్” (Speed Trial Monitoring) విధానాన్ని ఏపీ పోలీస్ శాఖ పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, గృహ హింస, పోక్సో కేసుల్లో నేరస్తులపై శిక్షలు పడేలా మరియు నేరాల నియంత్రణకు శాఖ కార్యక్రమాల్లో భాగంగా ఆపరేషన్ దండాయన ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు