తణుకు: వైసీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు: వైసీపీ తణుకు పట్టణ అధ్యక్షుడు శేషగిరి
వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయ పరమైన విమర్శలు చేయాలని కూటమి నాయకులకు తణుకు వైసీపీ నేతలు హితవు పలికారు. ఆదివారం తణుకు వైసీపీ కార్యాలయంలో వారు మాట్లాడారు. పార్టీలు మారిన నాయకులు ఇప్పుడు వైసీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తణుకు పట్టణ అధ్యక్షుడు శేషగిరి, లీగల్ సెల్ నాయకుడు సాయిబాబా రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు గురు ప్రసాద్ పాల్గొన్నారు.