కనిగిరి: మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరావు
కనిగిరి : మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కనిగిరి మున్సిపల్ కమిషనర్ పిల్లి కృష్ణమోహన్ రెడ్డికి మున్సిపల్ కార్మికులు శనివారం వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా సిఐటియు ప్రకాశం జిల్లా కార్యవర్గ సభ్యులు పీసీ కేశవరావు మాట్లాడుతూ... కరోనా సమయంలో విధుల్లోకి తీసుకున్న కార్మికులను అప్కాస్ పరిధిలోకి చేర్చి వారికి జీతాలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా మృతి చెందిన మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. కనిగిరి మున్సిపాలిటీలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని కోరారు.