తాడిమర్రి ముదిగుబ్బ బత్తలపల్లి ఎంపీడీవోలతో పరిటాల శ్రీరామ్ కీలక సమావేశం.
ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఆదివారం పట్టణంలోని తన కార్యాలయంలో ముదిగుబ్బ తాడిమర్రి బత్తలపల్లి ఎంపీడీవోలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు విడుదలవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో చేపట్టబోయే పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా ఏ ఏ పనులు చేయాలో రూపకల్పన చేయాలని సూచించారు.