డోన్: డోన్ లో ఆపదలో ఉన్న మహిళకు అండగా నిలిచిన ద్రోణాచలం సేవా సమితి సభ్యులు,పోలీసులు
Dhone, Nandyal | Jun 21, 2026 తీవ్ర అస్వస్థతతో రోడ్డుపక్కన పడిఉన్న ఓ క్యాన్సర్ బాధిత మహిళకు ద్రోణాచలం సేవా సమితి సభ్యులు, పోలీసులు సకాలంలో సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఆదివారం వాకింగ్కు వెళ్లిన డీసీసీ అధ్యక్షుడు మద్దిలేటి స్వామి పోలీస్ స్టేషన్ సమీపంలో సుమారు 58 ఏళ్ల మహిళ అస్వస్థతతో బాధపడుతూ కనిపించడంతో వెంటనే స్పందించారు. ద్రోణాచలం సేవా సమితి సభ్యులకు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు.