డోన్: బేతంచెర్ల మండలంలో డీజే లతో ప్రజలకు నిద్ర కరువు
Dhone, Nandyal | May 5, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం అంబాపురం గ్రామ ప్రజలు వరుస పెళ్లిళ్ల మెరవణుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులుగా గంగమ్మ గుడి దగ్గర రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అధిక శబ్దంతో డీజేలు మోగిస్తున్నారు. నిద్ర లేకుండా చేస్తున్న ఈ సౌండ్లపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, అనుమతి లేని డీజేలపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.