పుంగనూరు: పెద్ద కొండామర్రి గ్రామం సమీపంలో పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడులు.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం చౌడేపల్లి మండలం పెద్ద కొండా మర్రి గ్రామం వద్ద కోళ్ల ఫారాలలో పేకాట ఆడుతున్నారని రాబడిన సమాచారం మేరకు చౌడేపల్లె ట్రైన్ సబ్ ఇన్స్పెక్టర్ వి. మణికంఠేశ్వర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది మెరుపు దాడి నిర్వహించి పేకాట ఆడుతున్న 6 మందిని అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి పదివేల 140 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చౌడేపల్లి ఎస్సై నాగేశ్వరరావు బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఓ ప్రకటనలో తెలిపారు