అమరావతి పేరుతో అప్పులు చేసి దోచుకునే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది : వైసిపి మాజీమంత్రి అంబటి రాంబాబు
Ongole Urban, Prakasam | Apr 20, 2026
అమరావతి పేరుతో అప్పులు చేసి దోచుకునే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పూనుకున్నాడని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు సోమవారం ఒంగోలు వైసిపి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చినప్పటి నుంచి రకరకాల ట్రోలింగ్లు చేస్తున్నారని, గతంలో తిరుపతి లడ్డు విషయంలో కూడా అలాగే చేశారన్నారు. అమరావతి రాజధాని అసలు ఎక్కడుందన్నారు గుంటూరులో బస్సు ఎక్కి అమరావతికి టికెట్ అడిగితే అమరావతి గుడికి తీసుకువెళ్తారని ఎద్దేవా చేశాడు