ఒంగోలు అర్బన్: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు “పీఎం-రాహత్ ఒక వరం : జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | May 15, 2026
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “పీఎం-రాహత్ పథకం అత్యంత ఉపయోగకరమైనదని జిల్లా ఎస్పీతెలిపారు. రోడ్డు భద్రత విషయంలో జిల్లా వ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా నివారణ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. PM రాహత్ పథకం కింద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రిలో చేర్పించి, మొదటి *48 నుండి 72 గంటల ‘గోల్డెన్ అవర్’*లో రూ.1.50 లక్షల ఉచిత వైద్యం అందుతుందన్నారు