ఒంగోలు అర్బన్: జూలై 10న చలో కలెక్టరేట్ కు అంగన్వాడీలు తరలిరండి.
Ongole Urban, Prakasam | Jun 26, 2026
అంగన్వాడీల వేతనాల పెంపు,హామీల అమలుకై జూలై 10న కోర్కెల దినోత్సవం సంధర్భంగా చలో కలెక్టరేట్ కు అంగన్వాడీలు తరలిరావాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు పిలుపుఇచ్చారు.అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా శిక్షణా తరగతులు సి. హెచ్. ఇందిరావతి అధ్యక్షతన జరిగాయి.ఈ సంధర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిన అంగన్వాడీలకు 42 రోజుల సమ్మెలో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదు. మహిళలలైన అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలుచేయడం పట్లకాని, తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు ఇస్తామన్న హామీ నెరవేర్చాలన్నారు