చీమకుర్తి పట్టణంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలను చేపట్టారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు జరిగాయి. వాహనాలలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాతే వాటిని ముందుకు వెళ్ళనిచ్చారు. వాహనాల్లో మత్తు పదార్థాలు, మారనాయుధాలు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.