హత్నూర: హత్నూర మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం, ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం కురిసిన భారీ వర్షంతో ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలోని కాసాల దౌల్తాబాద్ కొన్నాల పన్నాల మల్కాపూర్ మంగాపూర్ తదితర గ్రామాల్లో సాయంత్రం కురిసిన భారీ వర్షంతో పొలాలలో దారి పొడవున వర్షపు నీరు ప్రవహించింది. మండలంలోని పలు గ్రామాల్లో అలుగులు పారాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాడుబడిన ఇండ్లలో ఉండరాదని అధికారులు సూచించారు.