ఖైరతాబాద్: లంగర్ హౌస్ లో సమాధి నుంచి మృతదేహం తరలింపు
తాహిర్ బిన్ సబీర్ నవంబర్ 4న మృతి చెందగా లంగర్‌హౌజ్ శ్మశానవాటికలో సమాధి చేశారు. కానీ గోల్కొండ ప్రాంతానికి చెందిన ఒక సమూహం మృతుడు తమ బంధువని, ఖననాన్ని వ్యతిరేకిస్తూ మృతదేహాన్ని వెలికితీసి తరలించాలని డిమాండ్ చేసింది. పోలీసుల ప్రమేయం ఉన్నప్పటికీ, పలుకుబడి ఉన్న వ్యక్తుల ఒత్తిడి, రాతపూర్వక ఒప్పందం కారణంగా చివరికి మృతదేహాన్ని మరొక ప్రదేశానికి తరలించారు.