నంద్యాల అర్బన్: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు : వైసిపి నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి
Nandyal Urban, Nandyal | Jun 2, 2026
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' పోస్టర్, బుక్లెట్ను ఆవిష్కరించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఉద్యోగులు, రైతులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆయన మండిపడ్డారు.