బనగానపల్లె: పసుపుల గ్రామంలో రూ. 85.20లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లాబనగానపల్లె మండలం పసుపులలో శనివారం సాయంత్రం రూ.85.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ముందుగా గ్రామ నాయకులు నడిపి భూషన్న, బాలనాయుడు, షేక్షావలి ఆధ్వర్యంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు బండి మౌళీశ్వర రెడ్డి, అమర్నాథ్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు