సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా మొహరం వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జర సంఘం మండలంలోని బర్దిపూర్ గ్రామంలో శనివారం సాయంత్రం కుల మతాలకతీతంగా భక్తులు పీరిలను ప్రతిష్టించి కుడుకలు ,బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించారు. కుప్ప నగర్ నుండి బర్దిపూర్ పీరీలను తరలించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించి అలావు ఆటలు, దూల దరువులతో సందడి చేశారు. భక్తులు వివిధ గ్రామాల నుండి విచ్చేసి మొహరం వేడుకలను తిలకించారు.