వనపర్తి జిల్లా పానగల్ మండలం, చింతకుంట గ్రామం, వీపనగండ్ల మండలం, గోవర్ధన గిరి గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో సర్వే జరుగుచున్న తీరును పరిశీలించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల తుది జాబితా వివరాలు వెల్లడించేందుకు, అభ్యంతరాలు స్వీకరించేందుకు జనవరి 21 నుండి 24 వరకు నిర్వహించే గ్రామ సభలు ఏ రోజు ఏ గ్రామంలో నిర్వహిస్తున్నారో ముందుగానే అన్ని గ్రామాల్లో చాటింపు వేయించాలని అధికారులను ఆదేశించారు.