పలమనేరు: చిన్నూరు ఫ్లైఓవర్ వద్ద అదుపుతప్పిన కారు, మూడు పల్టీలు కొట్టింది, ఇద్దరికి గాయాలు
పలమనేరు: బైపాస్ లో చిన్నూరు ఫ్లైఓవర్ వద్ద ఒక కారు అదుపుతప్పి 3 పల్టీలు కొట్టి బోల్తా పడింది. కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన ఒక కుటుంబం తిరువన్నామలై దైవదర్శనం ముగించుకుని, తిరుగు ప్రయాణం లో ఈ సంఘటన జరిగినదని తెలిపారు. ఎడతెరిపిలేని వర్షం, రోడ్డుపై నిలిచిన నీరు కారణంగా కారు అదుపుతప్పి ప్రమాదం జరిగిందన్నారు. ఈ యాక్సిడెంట్ లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామన్నారు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది, మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సిఉంది.