డోన్: డోన్ లో ప్రభుత్వ ఆసుపత్రిలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | May 7, 2026 ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి సూచించారు. గురువారం డోన్ పట్టణంలోని రోకలిబండసత్రం మరియు పాతపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రుల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల నిల్వలు, పారిశుధ్య పరిస్థితులు, వైద్య పరికరాల వినియోగం, సిబ్బంది హాజరు మరియు విధుల నిర్వహణ తదితర అంశాలను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి విభాగాన్ని సందర్శిస్తూ రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న చికిత్స,