నందికోట్కూరు: వడ్డేమాన్ గ్రామంలో ఐదుగురు పేకాటరాయలు అరెస్ట్
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం వడ్డేమాన్ గ్రామంలోని సచివాలయం సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై మణికంఠ తెలిపారు, వారి వద్ద నుంచి 5570 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు