బనగానపల్లె: అవుకు రిజర్వాయర్ లో నీటి కుక్కల సందడి
నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. వారం రోజులుగా రిజర్వాయరు సందర్శించే వారికి నీటిలో ఈదే కుక్కలు దర్శనమిస్తూ కనువిందు చేస్తున్నాయి. అవుకు రిజర్వాయర్, గొల్లలేరు వాగు ప్రాంతంలో సుమారు 40 నుంచి 60 నీటి కుక్కలు కనిపిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి గాలేరు నగరి, ఎస్ఆర్బీసీ కాలువ ద్వారా ఇవి అవుకు రిజర్వాయర్కు వచ్చి ఉంటాయని అధికారులు చెబుతున్నారు