గుంటూరు: కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో తురకపాలెం గ్రామ సమస్యలను తీసుకువెళ్లిన ప్రత్తిపాడు వైసిపి ఇన్చార్జి కిరణ్
Guntur, Guntur | Sep 15, 2025 గుంటూరు రూరల్ మండలం, తురకపాలెంలో అనేకమంది మరణించడం జరిగిందని, కానీ ఇంతవరకు మరణాలకు గల కారణాలను రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవడంలో వైఫల్యం చెందిందని ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బాలసాని కిరణ్ కుమార్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని జాయింట్ కలెక్టర్ కు తురకపాలెం గ్రామంలో సంభవించిన మరణాలకు సంబంధించి కారణాలను వెంటనే గుర్తించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో బాలసాని కిరణ్ కుమార్ మాట్లాడారు.