గోకవరం: నల్లజర్ల మండలంలో కోడి పందాల స్థావరంపై పోలీసుల దాడి, 28 మంది అరెస్టు, 28 సెల్ ఫోన్లు స్వాధీనం
జిల్లాలోని నల్లజర్ల మండలం ముసళ్ల కుంట గ్రామంలో కోడిపందాలపై స్థావరం పై నల్లజర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు గురువారం ఉదయాన్నే దాడులు నిర్వహించి 28 మందిని పందెం రాయుళ్లను అరెస్ట్ చేసారు. వారి వద్ద నుండి 28 సెల్ ఫోన్లు 7 కార్లు ఒక మోటార్ సైకిల్ 2 కోడి పుంజులు రూ.6 లక్షల 2 వేల110 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.