చినగంజం టోల్ ప్లాజా వద్ద బైకును ఢీకొని ఆగకుండా వెళ్లిపోయిన కారు, ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
దిగమర్రు జాతీయ రహదారిపై చిన్నగంజాం టోల్గేట్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చెన్నైకి చెందిన ఇస్మాయిల్,అతని స్నేహితుడు జబ్బారు బాపట్లలో ఒక శుభకార్యానికి హాజరై బైకుపై తిరిగి వెళుతుండగా అమిత వేగంతో వచ్చిన ఒక కారు వారిని ఢీకొని ఆగకుండా వెళ్ళిపోయింది. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.హైవే పోలీసులు వారిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇస్మాయిల్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు