బనగానపల్లె: బనగానపల్లెలో దారుణం, అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం వీరవోలు గ్రామంలో లక్ష్మీ అని మహిళను భర్త వెంకటస్వామి అతని సోదరులతో కలిసి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. ఈనెల రెండో తేదీన లక్ష్మీ కనబడడం లేదని తల్లి వెంకటసుబ్బమ్మ నందివర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దీనిపై బనగానపల్లె రూరల్ సిఐ మంజునాథరెడ్డి ఎస్సై భూపాలుడు విచారణ చేపట్టగా భర్త అతని సోదరులే హత్య చేసినట్లు నిర్ధారించి వారిని అదుపులోని తీసుకొని రిమాండ్ తరలించారు పూర్తి వివరాలు గురువారం సీఐ మీడియా వివరించారు