నంద్యాల అర్బన్: నంద్యాలలో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్
Nandyal Urban, Nandyal | May 11, 2026
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షౌరాణ్ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ జావళి ఆల్ఫోన్స్ ఆధ్వర్యంలో నంద్యాలలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. బస్టాండ్, అంజుమన్ మసీద్, సంజీవనగర్ గేట్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై, తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని ఆమె స్పష్టం చేశారు.