కర్నూలు: కారణజన్ముడు నరేంద్ర మోడీ: కర్నూలులో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణజన్ముడని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం 12 గంటలు కర్నూలు గౌరీ గోపాల్ హాస్పిటల్ సర్కిల్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ తన రాజకీయ చతురతతో దేశాన్ని పురోగవృద్ధి దిశలో పయనింప చేస్తున్నారనీ అన్నారు.కష్టనష్టాలతో కొట్టి మిట్టాడుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరిదిద్ది ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరుకునేలా కృషి చేశారని ఆయన కొనియాడారు.