మిర్యాలగూడ: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్మెన్ యూరియాని పక్కదోవ పట్టించాడని వస్తున్న వార్తలను ఖండించిన వ్యవసాయ శాఖ అధికారులు
నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్మెన్ యూరియా లారీని పక్కదోవ పట్టించారని వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. యూరియా సరఫరా లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, మంజూరు అవుతున్న యూరియాను రైతులకే పంపిణీ చేస్తున్నమని తెలిపారు. యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియా సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.