బనగానపల్లె: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాన్వాయ్ లో వాహనాల తగ్గింపు
ప్రధాని మోదీ ఆదేశాల నేపథ్యంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. డీజిల్, పెట్రోల్ పొదుపు చర్యలో భాగంగా ఎస్కార్ట్ వాహనాన్ని వెనక్కి పంపించారు. అధికారిక పర్యటనల్లో అనవసర భద్రతా వాహనాలను తగ్గించాలని అధికారులకు సూచించారు.ప్రజలు కూడా పొదుపు చర్యలు పాటిస్తూ అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.