నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్
Nandyal Urban, Nandyal | Jul 9, 2026
గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లె పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు.. నంద్యాల జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో బహిరంగంగా సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పనితీరును ప్రస్తావించారు. మైనస్లో ఉంటే కుదరదని.. కచ్చితంగా ప్లస్లోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. కలెక్టర్, డైరెక్టర్ల సహకారం తీసుకొని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.