రాప్తాడు: రైతులకు తక్షణమే యూరియా అందించాలి అనంతపురంలో జెడిఎ కార్యాలయంలో రాప్తాడు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున డిమాండ్
అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్న 12:20 నిమిషాల సమయంలో సిపిఐ జిల్లా పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి రాప్తాడు సిపి జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ జిల్లా వ్యాప్తికంగా వరి పత్తి మొక్కజొన్న మిరప పంటలకు యూరియా పంట ఎదుగుదలకు కచ్చితంగా వాడాలని అందుకనే రైతులందరికీ యూరియాని అందించాలని అధికారులను కోరడం జరిగిందని సిపిఐ నారాయణస్వామి మల్లికార్జున డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో రాప్తాడు ఆత్మకూరు సిపిఐ నేతలు పాల్గొన్నారు.