ఆత్మకూరు: సోమశిల జలాశయానికి పోటెత్తిన వరద, పెన్నా డెల్టాకు భారీగా నీరు విడుదల, ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
నెల్లూరు జిల్లా, అనంతసాగరం మండలం, సోమశిల జలాశయంకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. తుఫాన్ నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ఆ వరదంతా జలాశయం వైపు వస్తుంది. ఇన్ఫ్లో 83,182 క్యూసెక్కులు రావడంతో జలాశయం 4,5,6,7,8,9, క్రస్ట్ గేట్లు ద్వారా పెన్నా డెల్టాకు 92,650 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 71 TMCల నీరు నిల్వ ఉంది. దీంతో ఇప్పటికే సోమశిల పెన్నా పరివాహక ప్రాంతాలను ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తమ సిబ్బందితో కలిసి అప్రమత్తం చేశారు.