రాజేంద్రనగర్: షాద్‌నగర్ పట్టణంలో పరిశ్రమను తొలగించాలి
షాద్ నగర్ పట్టణంలోని సీఎస్కే గ్రీన్ విల్లాస్ వెంచర్‌కి సమీపంలో ఉన్న ఓ పరిశ్రమ ద్వారా ఉత్పన్నమవుతున్న కాలుష్యంతో అవస్థలు పడుతున్నామని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. నీరు, చెట్లు పొగ బారి పోతున్నాయని, పలువురు వ్యాధుల బారిన పడుతున్నారని వాపోతున్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందించి పరిశ్రమపై చర్యలు తీసుకునేలా చూడాలని, లేదా కంపెనీని తరలించాలని కోరుతున్నారు