నందికోట్కూరు: నియోజకవర్గంలో అంబరాన్ని అంటిన అంబేద్కర్ జయంతి వేడుకలు,నివాళులర్పించిన ఎమ్మెల్యే,అధికారులు,ప్రజా, దళిత సంఘాల నాయకులు
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రంలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. మంగళవారం జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలు జూపాడు బంగ్లాలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షాజహాన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు, అలాగే పట్టణంలో కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రజా మరియు దళిత సంఘాల నాయకులు మాల మహానాడు,ఎమ్మార్పీఎస్ సిపిఐ ఎంఎల్,సిపిఎం,సిపిఐ ఉద్యోగులు భారీగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటాలను చేత పట్టుకొని డీజే సౌండ్ సిస్టం అంబేద్కర్ పాటలతో కేజీ రహదారి వెంట చక్కటి డాన్సులత