కొప్పోలు కృష్ణ మందిరంలో చోరీ, హుండీలో ఉన్న 25 వేల రూపాయల నగదు అపహరణ, విచారణ చేపట్టిన పోలీసులు
Ongole Urban, Prakasam | Sep 16, 2025
ఒంగోలు నగర శివారులోని కొప్పోలు కృష్ణ మందిరంలో సోమవారం రాత్రి పొద్దు పోయాక దొంగలు పడ్డారు.ఆలయం ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి దొంగలు లోన ప్రవేశించి హుండీలో ఉన్న నగదును అపహరించుకుపోయారు.మంగళవారం ఉదయం అర్చకులు ఆలయానికి రాగానే చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుండీలో 25 వేల రూపాయలకు పైగా నగదు ఉన్నట్లు అర్చకులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు