ఎల్కతుర్తి: జిల్లాలోని పెంబర్తి, వీర నారాయణపూర్ గ్రామాల్లో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ స్నేహ శబరీష్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లాలో పైలట్ గ్రామాలైన హసన్ పర్తి మండలం పెంబర్తి, ఎల్కతుర్తి మండలం వీర నారాయణపూర్ లో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో కలెక్టర్ మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి గురించి కలెక్టర్ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.