ధర్మవరం పట్టణంలోని మూడు బావుల సర్కిల్ లో ఆగి ఉన్న ద్విచక్ర వాహనంపై దూసుకు వచ్చిన కారు ముగ్గురికి గాయాలు
Anantapur Urban, Anantapur | May 11, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం పట్టణంలోని మూడు బావుల సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనం ను ఆపి రోడ్డు పక్కకు నిలబడి ఉన్న కుటుంబం పై కారు దూసుకుని రావడంతో ఎడాపులపర్తి గ్రామానికి చెందిన మల్లికార్జున మణిదీపక్ శ్రీ చరణ్ అనే ముగ్గురికి గాయాలయ్యాయి. ఏడాపుల పర్తి నుంచి పుట్టపర్తికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ధర్మవరంలో రోడ్డు పక్కన నిలబడి వేచి చూస్తున్న సమయంలో కారు దూసుకుని రావడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.